Jun 21,2023 19:13

గుర్తింపు కార్డులు అందజేస్తున్న వైస్‌ ఎంపిపి

ప్రజాశక్తి - పెద్దకడబూరు
కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వైస్‌ ఎంపిపి ఇర్ఫాన్‌ దేశాయి తెలిపారు. బుధవారం మండలంలోని కల్లుకుంట రైతు భరోసా కేంద్రంలో విఆర్‌ఒ తిప్పన్న, విఎఎ పవన్‌ కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు ఇచ్చిన గుర్తింపు కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. రైతులకు గుర్తింపు కార్డులు వరం లాంటివని చెప్పారు. రైతులు పాల్గొన్నారు. హాలహర్వి మండలంలోని చింతకుంట గ్రామంలో కౌలు రైతుల గుర్తింపు గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో దాదాపు 32 మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇస్తామని ఎఒ శివ శంకర్‌ తెలిపారు. విఆర్‌ఒ విజరు, సర్పంచి సద్దాం హుస్సేన్‌ పాల్గొన్నారు.