Apr 11,2023 23:59

 తాడికొండ: కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించాలని మం డల రైతు సంఘం కార్యదర్శి కనగాల పూర్ణచంద్రరావు అన్నా రు, రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తాడి కొండలో రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలు తీసుకొని భూస్వా ములు రాయితులు అనుభవిస్తుంటే, కౌలు రైతులు రుణాలు తీసుకొని అవి కట్టలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నల్ల చట్టాలను దొడ్డిదారిలో అమలు చేయాలని చూస్తున్నారని, మోటార్లకు మీటర్లు బిగింపు తగదని అన్నారు. రైతులను మోసం చేసిన జగన్‌ తెరమరుగైయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు రైతు పంట పండించకపోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు చింతల భాస్కరరావు, మాదల చెంచయ్య, సుభాని,తాయి శ్రీహరి, కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.