చెక్‌ను ఇస్తున్న అధికారులు
ప్రజాశక్తి -పాడేరు: జిల్లాలో 154 మంది కౌలు రైతుల ఖాతాలకు రూ.11లక్షల 55 వేలను ప్రభుత్వం జమ చేసిందని జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు స్పష్టం చేసారు. శుక్రవారం తాడేపల్లి సి.ఎం. క్యాంపు కార్యాలయం నుండి కౌలు రైతుల పెట్టుబడి సాయం విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ కార్యాలయం నుండి వీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్నికౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులకు నమూనా చెక్కును పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షురాలు ఎం.సరస్వతి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి. ఎస్.నంద్, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్ కుమార్‌రావు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు కన్నాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.










