ప్రజాశక్తి - నిడమర్రు
కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు లావేటి సోంబాబు మాట్లాడుతూ కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కౌలు రైతుల సంఘం మండల కార్యదర్శి కోన శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలలనే ఉద్దేశంతో 660 జిఒను తీసుకొచ్చారని విమర్శించారు. ఈ జిఒను రద్దుచేసి నష్టపోయిన రైతులను, కౌలు రైతులను ప్రభుత్వ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులందరికీ కులాలతో ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని. ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోలులో సమస్యలు పరిశీలించి నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని, పంటల బీమా పథకానికి ప్రభుత్వమే బాధ్యత వహించి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తహశీల్దార్ సాయిరాజ్‌కు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాలో వెలగలేటి మోహన్, కానూరు రాజు, నేతి దొరబాబు, దుత్తాడ వెంకన్న, బాపిరాజు, నరసింహమూర్తి, దండుపాటి రాంబాబు పాల్గొన్నారు.










