ప్రజాశక్తి-కంచికచర్ల
వీరులపాడు మండలం జుజ్జూరు లో ఈ నెల 18 న జరిగే కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్ జిల్లా 3 వ మహాసభలో జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయం లో బుధవారం కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల శీతారామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తు లో కార్యాచరణ రూపొందించేందుకు మహాసభ లో చర్చిస్తామన్నారు. రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతులు, కౌలు రైతులు కలిసి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. చేశారు.










