Oct 09,2023 23:55

ప్రచారజాతాలో మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు పిలుపు
ప్రజాశక్తి - అమలాపురం
అమలాపురంలో ఈ నెల 11న జరిగే కౌలు రైతుల రాష్ట్ర సదస్సులకు కౌలు రైతులందరూ తరలి రావాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరా పిలుపు నిచ్చ్చారు. సామవారం వన్నె చింతలపూడి, తాండవపల్లి, భట్నవిల్లి, వేమవరం వేమవరప్పాడు, జనిపల్లి, అల్లవరం మండలం గుడాల కోడూరుపాడు, అల్లవరం, యెంట్రికోన, డి.రావుపాలెం, దైవగుప్తం, ఉప్పలగుప్తం మండలం సరిపల్లి, గోపవరం, కూనవరం, ఉప్పలగుప్తం, గొల్లవిల్లి, బీమనపల్లి తదితర గ్రామాల్లో ప్రచారజాతా సాగింది గ్రామాల్లో ఉన్న కౌలు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రైతు భరోసా -పిఎంకిసాన్‌ పథకం అమలు చేస్తామని చెప్పారన్నారు. ఆచరణలో మాత్రం అనేక నిబంధనలు పెట్టి కౌలు రైతులకు మొండి చేయి చూపారని విమర్శించారు. ఒసి కౌలు రైతులకు రైతు భరోసా లేదన్నారు. భూ యజమాని కింద ఎంత మంది కౌలు రైతులున్నా ఒక్కరికి మాత్రమే సాయం అందుతోందన్నారు. ఈ విషయంపై అమలాపురం నల్ల వంతెన రోడ్డు, షాదీఖానా బిల్డింగ్‌ వద్ద అక్టోబర్‌ 11న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు విస్సా కిరణ్‌కుమార్‌, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు తదితరులు హాజ రౌతారన్నారు. కౌలు రైతులందరూ ఈ సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్క రైతుకు కరపత్రాలు పోస్టర్ల అందించారు. . రాష్ట్రంలోని కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు బీమాల శ్రీను, విప్పర్తి మోహన్‌రావు, తాడి శ్రీరామ్మూర్తి, పి.సత్యనారాయణ, పి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు