Oct 08,2023 23:03

ప్రజాశక్తి-ఐ.పోలవరం
కౌలు రైతులందరూ రాష్ట్ర సదస్సుకు తరలి రావాలని సిపిఎం నాయకులు పిలుపు నిచ్చ్చారు. జి దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం ప్రచార జాత పాతఇంజరం నుంచి ప్రారంభించారు. పెదమడి, ఐ. పోలవరం, జి.వేమవరం, గుత్తెనదీవి, ఎదుర్లంక, కొమరగిరి, మురమళ్ళ గ్రామాల్లో ఉన్న కౌలు రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు రైతు భరోసా-పిఎంకిసాన్‌పథకం అమలు చేస్తామని సిఎం జగన్‌ గొప్పగా ప్రకటించారన్నారు. ఆచరణలో మాత్రం అనేక నిబంధనలు పెట్టి కౌలు రైతులకు మొండి చేయి చూపారని విమర్శించారు. సిపిఎం నాయకులు జి. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ఒసి కౌలు రైతులకు రైతు భరోసా లేదన్నారు. భూయజమాని కింద ఎంత మంది కౌలు రైతులున్నా ఒక్కరికి మాత్రమే సాయం అందుతోందన్నారు. ఈ విషయం పై అమలాపురం నల్ల వంతెన రోడ్డు, షాదీఖానా బిల్డింగ్‌ వద్ద అక్టోబర్‌ 11న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య మైన నాయకులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు స్వరాజ్య వేదిక జాతీయ నాయకులు విస్సా కిరణ్‌ కుమార్‌, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు తదితరులు హాజ రౌతారని అన్నారు.కౌలు రైతులందరూ ఈ సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్క రైతుకు కరపత్రాలు పోస్టర్ల అందించారు. కార్యక్రమంలో పి.బాలయ్య, తాడి శ్రీరామమూర్తి, ముమ్మిడివరపు సుబ్బారావు, పాటి హరి కృష్ణ, తోట సత్యనారాయణ, పేరాబత్తుల వీరబాబు, బొర్రా నరసింహరావు, రాచకొండ చంద్రరావు, పెద్ది రెడ్డి సత్తిబాబు పాల్గొన్నారు. కాట్రేనికోన రాష్ట్రంలోని కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈనెల 11న అమలాపురం నల్ల వంతెన వద్ద గల షాదీఖనా బిల్డింగులో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు ను నిర్వహించనున్నారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కాట్రేనికోన మండలంలోని పల్లంకూరు పంచాయతీ పరిధిలోని బట్టు చెరువు గ్రామంలో జీపు జాతా ద్వారా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సదస్సుకు మండలం నుండి అధిక సంఖ్యలో కౌలు రైతులు పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని దుర్గాప్రసాద్‌ పిలుపునిచ్చారు. ఈ జాతాలో పాము బాలయ్య, జగడం నాగేశ్వరరావు, విప్పర్తి మోహన్‌ రావు, విత్తనాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.