Jun 07,2023 23:19

పొనుగుపాడులో రైతు భరోసా అధికారికి వినతిపత్రం అందజేస్తున్న కౌలు రైతు సంఘం నాయకలు

ఫిరంగిపురం: కౌలు రైతులకు భూ యజమాని సంతకముతో సంబంధం లేకుండా కౌలు రైతు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం నాయకులు కోరారు. పొనుగు పాడులో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రైతు భరోసా అధికారి గణేష్‌కు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎస్‌ఎం వలి మాట్లాడుతూ మన రాష్ట్రంలో నూటికి 70 మంది కౌలు రైతులే వ్యవసాయం సాగు చేస్తున్నారని కోటి మంది ప్రజలు కౌలు పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఎక్కువమంది భూ యజమానులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు చేసుకుంటూ ఇతర ప్రాం తాలకు వెళ్లారని, గ్రామాలలో కూలినాలి చేసుకుంటూ దళితులు, బలహీన వర్గాలు, నిరుపేదలు, కౌలు వ్యవసాయంలోకి మారారని అన్నారు. గతంలో సాగు ధ్రువీకరణ పత్రాలు, రుణాత్కార్డులు ఇచ్చి కొద్ది మోతాదుల్లో కౌలు రైతులకు ఉపయోగ పడ్డాయన్నారు. గతంలో ఉన్న కౌలు చట్టాలను రద్దుచేసి, భూ యజమాని సంతకము ఉంటేనే కౌలు కార్డులు ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం నిబంధన చేర్చిందని, దీంతో, భూ యజమానులు సంత కం పెట్టడానికి ముందుకు రావడం లేదని, దీని ఫలి తంగా కౌలు చేస్తున్న రైతులు సీసీ కార్డులు పొందలేక పోతున్నా రన్నారు. కౌలు రైతుల కష్టాలు తీరాలంటే ఇప్పుడున్న కౌలు చట్టాన్ని మార్చాలని, భూ యజమాని సంతకం అనే నిబంధనను కచ్చితంగా తొలగించాలని అన్నారు. గ్రామసభల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటల బీమా, నష్టపరిహారాలు, రైతు భరోసాను కుల భేదం లేకుండా, భూమిలేని ఒసి రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గ్రామ కౌలు రైతు సంఘం నాయకులు ఎం.భాస్కర్‌ రావు మాట్లాడుతూ జూన్‌ 12వ తేదీ విజయవాడ నుండి ప్రకా శం బ్యారేజీ మీదుగా సిసిఎల్‌ఎ ఆఫీసుకు జరిగే రాయబారానికి గ్రామ కౌలు రైత ు లందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కె. రత్తయ్య, కె.విశ్వేశ్వర రావు, కె. కోటేశ్వరరావు, ఐ.నాగేశ్వర రావు పాల్గొ న్నారు. కౌలు చట్టాన్ని మార్చాలని, భూ యజ మాని సంతకం అనే నిబంధన కచ్చి తంగా తొల గించాలని కౌలు రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం అధికారికి వినతి పత్రం సమర్పించారు.