Sep 11,2023 20:53

ఫొటో : నిరసన చేపడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు, నాయకులు

కావలిలో బంద్‌ ప్రశాంతం
- మాలేపాటి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
ప్రజాశక్తి-కావలి : టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు సోమవారం కావలిలో బంద్‌పై ఉక్కుపాదం మోపారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడుని ''హౌస్‌ అరెస్ట్‌'' చేశారు. ప్రతి నాయకుడి ఇంటి ముందు కనీసం 4గురు పోలీసులతో పికెట్‌లు ఏర్పాటు చేశారు. అయితే, పట్టణంలోని పాఠశాలలు మూయరాదంటూ, ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చినా కూడా పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. అన్ని బ్యాంకులను మూసి వేశారు. దుకాణ దారులు కొందరు స్వచ్ఛందంగా ముసివేశారు. బంద్‌ను ఘనంగా చేయాలనుకున్న టిడిపి నాయకుల ఎత్తుగడలను పోలీసులు భగం చేశారు
. కావలి టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడును గత 2 రోజులుగా హౌస్‌ అరెస్ట్‌ చేసిన విషయం పాటకులకు విధితమే అయినా ఆయన రెండు సార్లు బంద్‌ చేసేందుకు తన కార్యకర్తలతో కలిసి తన ఇంటినుండి బయల్దేరెందుకు రెండు సార్లు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే డిఎస్‌పి ఎం.వెంకటరమణ, ఒకటో పట్టణ సిఐ శ్రీనివాసరావు, అయన సిబ్బందితో బలవంతంగా అడ్డుకుని, సుబ్బానాయుడును చేతులపై తిరిగి ఇంటివద్దకు చేర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఆ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టిడిపి శ్రేణులు, మిత్రపక్షాలైన జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి డౌన్‌! డౌన్‌!అంటూ... నినాదాలతో హోరెత్తించారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగటంతో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. చంద్రబాబును అరెస్టు చేయడంతో పార్టీ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చిందని అందులో భాగంగానే ఆందోళన చేస్తున్నామని నేతలు తెలిపారు. బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లమోతు శ్రీనివాసులు, మంచాల ప్రసాద్‌, దావులూరు దేవకుమార్‌, గుత్తికొండ కిషోర్‌ బాబు, చాగంటి వెంకటేశ్వర్లు, కుల్లూరు అశ్విని, నేలపాటి మాల్యాద్రి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.