
కావలి రైతులకు సాగునీరు అందించండి
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించి పంటలను రక్షించాలని టిడిపి కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నా డెల్టా ఆయకట్టు పరిధిలోని అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి మండలాల్లో వరి నారులు పోసుకోవడానికి సాగునీటి సౌకర్యం లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కావున కావలి నియోజకవర్గానికి ఐ.ఎ.బి. త్వరగా వర్తింపజేయాలని, లేనిపక్షంలో నారుమళ్లకు సాగునీరు అందించి నియోజకవర్గ రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా డిఆర్ (దగదర్తి - రాచర్లపాడు) చానల్ పనుల్లో జరుగుతున్న అవినీతిని వివరించారు. గతంలో రైతులు సాగునీటికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బీద రవిచంద్ర జైకా వారిని తీసుకొని పర్యటించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా 2018వ సంవత్సరంలో రూ.30 కోట్ల పనులకు మంజూరు చేయించామన్నారు. ఇప్పుడు ఉన్న అధికారులే ప్రతిపాదనలు చేసి టెండర్లు పిలిపించారని తెలిపారు. పనులు 0 కి.మీ నుండి 6.8 కి.మీ వరకు జరగాల్సిన అవసరం ఉండగా ఇక్కడ మాత్రం పనులు జరగకుండా కింది భాగంలో అవసరంలేని చోట పనులు చేపడుతూ కోట్లకు కోట్లు నిధులు కాజేస్తున్నారని తెలియజేశారు. అవసరం లేని చోట నామమాత్రంగా పనులు చేపట్టి, అవసరం ఉండి ప్రతిపాదించిన చోట మాత్రం ఎటువంటి పనులు చేపట్టకుండా రైతులను అన్యాయం చేస్తున్నారన్నారన్నారు. గతంలో సెంట్రల్ డివిజన్ పరిధిలో ఉన్న ఈ కాలువ పనులు ప్రస్తుతం కావలిలోని నెల్లూరు నార్త్ డివిజన్‌కు మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలను విచారణ జరిపి, రైతులకు న్యాయం జరిగేలా శాశ్వత పరిష్కార పనులు చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి మలేపాటి సుబ్బానాయుడుతోపాటు అల్లూరు టిడిపి ముఖ్య నాయకులు బీద గిరిధర్, ముఖ్య నాయకులు నెల్లూరు నిరంజన్ రెడ్డి, రేబాల శంకర్ రెడ్డి, చెముకుల చంగయ్య, ఆట తిరుమల, నీలపరెడ్డి హరీష్ రెడ్డి, విడవలూరు దశరథరామిరెడ్డి, కంద రమణయ్య, తోట శ్రీహరి, అంబటి రాజేంద్ర, పెనుమల్లి శ్రీనివాసుల రెడ్డి, దాసరి వెంకటేశ్వర్లు, చాగంటి రామకృష్ణారెడ్డి, పచ్చబొట్ల చిన్న, రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు.