మాట్లాడుతున్న డిఎం
కావలి-నెల్లూరు నాన్ స్టాప్
బస్సు ప్రయాణ సమయం తగ్గింపు
ప్రజాశక్తి-కావలి: కావలి-నెల్లూరుల మధ్య తిరుగుతున్న నాన్ స్టాప్ బస్సు ప్రయాణంలో మరింత సమయం ఆదా అయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఎపిఎస్ ఆర్టీసీ, కావలి డిపో మేనేజర్ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. కావలి నుంచి నెల్లూరు వెళ్లు నాన్ స్టాప్ బస్సుకు బస్టాండ్ లో టికెట్ ఇచ్చిన తరువాత, ముసునూరు చేరేలోగా ఎక్కిన ప్రయాణికులకు ముసునూరు వద్ద టికెట్ ఇచ్చే ఏర్పాట్లు ఉండేవన్నారు. అదే విధంగా నెల్లూరు నుండి కావలికి వచ్చే సమయంలో ఇనమడుగు రోడ్ వద్ద టిక్కెట్లు ఇచ్చేవారని అన్నారు. ఇందువలన కొంత సమయం వథా అయ్యేదని వివరించారు. ఇప్పుడు మధ్యలోఎక్కినప్రయాణికులకు బస్సులోనే డ్రైవర్ టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని, అందువలన ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు. మరింత తక్కువ సమయంలో గమ్యం చేరవచ్చనిు పేర్కొన్నారు.










