ప్రజాశక్తి - కాకినాడ
గోదావరి జిల్లాలకు చిరస్మరణీయుడు కాటన్ అని జెఎన్‌టియుకె ప్రాంగణంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, కాకినాడ లోకల్ సెంటర్ భవనంలో సోమవారం సర్ ఆర్థర్ కాటన్ జయంతిని జెఎన్టియుకె, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కాకినాడ లోకల్ సెంటర్, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ అసోసియేషన్ కాకినాడ (ఆర్‌ఎస్‌ఐఇఎకె)ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెఎన్‌టియుకె విసి జివిజర్. ప్రసాదరాజు, ఇంజనీర్ ఎస్. నాగేశ్వరరావు, లోకల్ సెంటర్ ఛైర్మన్, స్కూల్ ఆఫ్ ఫుడ్ టేక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ విభాగాధిపతి ఎం. రమేష్ , లోకల్ సెంటర్ సెక్రటరీ వి.జయప్రసాద్ కాటన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఇంజనీర్ ఎన్.కష్ణారావు, సెక్రటరీ ఇంజనీర్ వి.కృష్ణారావు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కాకినాడరూరల్ : నన్నయ యూని వర్సిటీ ఈసీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సర్ ఆర్ధర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విసి ఆచార్య కె.పద్మరాజు హాజరై కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ప్రఫెసర్లు కె.రమణేశ్వరి, డి.జ్యోతిర్మయి, వై.శ్రీనివాసరావు, డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, డాక్టర్ టి.సత్యనారాయణ, డాక్టర్ కె.వి.ఎన్.డి. వరప్రసాద్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ యామిని జ్యోష్ణ, కీర్తిమరీఠ, డి.కిషోర్ పాల్గొన్నారు. వాకర్స్ ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ చిత్రపటానికి విశ్రాంత తహశీల్దార్ రేలంగి బాపిరాజు, అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, చింతపల్లి సుబ్బారావు, రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్‌లో ప్రిన్సిపాల్. డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీన్ అడ్మినిస్ట్రేషన్ విభాగం డాక్టర్ టి.నరేంద్రుడు, ఈ.సి.ఇ. విభాగాధిపతి వి.సత్యనారాయణ,గ్రంథాలయ విభాగా ధిపతి కె.అశోక్ కుమార్, తోటకూర గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్ డి. నవీన్ కుమార్, బల్లా సూర్యారావు, కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
జెఎన్‌టియుకెలో కాటన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న విసి ప్రసాద్‌రాజు, ప్రొఫెసర్లు










