Aug 28,2022 23:18

కాటన్‌ బ్యాగులను పంపిణీచేస్తున్న హెచ్‌పిసిఎల్‌ రిఫైనరీ హెచ్‌ఆర్‌ చీఫ్‌ మేనేజర్‌ ప్రభాకర్‌

ప్రజాశక్తి-ములగాడ : మల్కాపురం పరిధి పల్లివీధి, గొల్లవీధి, నగరాల వీధి, తెలుక వీధిలో ప్రతి ఇంటి నుంచీ ప్లాస్టిక్‌ బ్యాగులను సేకరించి కాటన్‌ బ్యాగులను ఆదివారం హెచ్‌పిసిఎల్‌ విశాఖ రిఫైనరీ హెచ్‌ఆర్‌ చీఫ్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్‌ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రతి ఇంటికీ వెళ్లి ప్లాస్టిక్‌ను సేకరించి కాటన్‌ బ్యాగ్‌ను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పిసిసిఎల్‌సిఎస్‌ పాలకవర్గ సభ్యులు ఎన్‌వి.రమణ, వైఎ.భాస్కరరావు, చెల్లిబోయిన శ్రీనివాసరావు, నూనెల పైడిరాజు, చోప్ప అప్పలరాజు, కార్మికులు ఉరుకూటి అప్పలరాజు, ఉరుకూటి శ్రీనివాసరావు, ఉరుకూటి బాబూరావు, టి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.