కాటి కాపరి బేగరీల సమస్యలు పరిష్కరించాలి
కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే రంగమ్మ
ప్రజాశక్తి - మిడుతూరు
కాటికాపర్ల బేగరీల సమస్యలను పరిష్కరించాలని కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే రంగమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కెవిపిఎస్ నాయకులు ఓబులేసు, లింగస్వామిల ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో జిఎన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా
కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే రంగమ్మ మాట్లాడుతూ కాటికాపర్ల బేగరీలకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారిని నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించి, మూడు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. వారి ఆత్మగౌరవం కోసం రెండు ఎకరాల భూమి ఇవ్వాలని, వయసుతో పరిమితం లేకుండా పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆనంద్, దాసు, కే లక్ష్మీదేవి, కమిటీ మెంబర్ శికామణి, దేవనూరు దేవన, చిన్న చెన్నయ్య, జయమ్మ, దావీదు, జయమ్మ, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.










