మాట్లాడుతున్న విద్యా కమిటీ చైర్మన్
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండలంలోని కిల్లోగుడ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో విద్యార్థులకు కాస్మోటిక్ వస్తువులు పంపిణీ చేయాలని ఆ పాఠశాల విద్యా కమిటి చైర్మన్ టి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు గత ఏడాది నుంచి కాస్మోటిక్ వస్తువులు సబ్బులు, బట్టలు, సబ్బులు, కొబ్బరినూనె, పౌడర్, షాంపూలు ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు. శీతాకాలం వస్తున్నప్పటికీ కప్పు కోవడానికి రగ్గులు, దుప్పట్లు నేటికి పంపిణీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం స్వందించి ప్రభుత్వ వసతి గృహల్లోచదువుతున్న పేద గిరిజన విద్యార్థులకు కాస్మోటిక్ వస్తువులతో పాటు దుప్పట్లు వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.










