
మాట్లాడుతున్న చింతకాయల రాజేష్
ప్రజాశక్తి-గొలుగొండ:2024 ఎన్నికల్లో టిడిపి విజయం కోసం సైనికుల్లా పని చేయాలని మాజీ మంత్రి అయ్యన్న తనయులు, నర్సీపట్నం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చింతకాయల రాజేష్ కోరారు. బుధవారం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్‌పురం అల్లూరి పార్కులో మాజీ జడ్పిటిసి చిటికెల తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువతకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు. పార్టీ గెలుపునకు ఇప్పటి నుంచే కృత నిశ్చయంతో పని చేసి రాబోయే ఎన్నికల్లో టిడిపిని నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కష్టించి పని చేసే వారికి పార్టీ మంచి గుర్తింపు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.