Oct 09,2023 21:27

కార్యకర్తలకు ఆర్థికసాయం చెక్కు అందజేస్తున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్‌

        ప్రజాశక్తి-అనంతపురం    జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికునికీ జనసేన పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్‌ తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన బుక్కరాయసముద్ర ం మండలం నీలారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బార్‌ ఆదెప్ప కుటుంబానికి సోమవారం నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రూ.50వేల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన రోడ్డు రోడ్డు ప్రమాదంలో ఆదెప్పకు రెండు కాళ్లుకూ గాయాలయ్యాయి. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ రూ.50వేలు ఆర్థికసాయం ప్రకటించినట్లు తెలిపారు. దీంతో బాధితుడికి మంజూరైన చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇన్‌ఛార్జి సాకే పవన్‌కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్‌, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్‌కుమార్‌, చొప్ప చంద్ర, జయమ్మ, అవుకు విజయకుమార్‌, పురుషోత్తమ్‌రెడ్డి, ముప్పూరి కృష్ణ, కృష్ణమూర్తి, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్‌కుమార్‌, నార్పల మండల కన్వీనర్‌ రామకృష్ణ, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్‌ ఎర్రిస్వామి, నాయకులు లోకేష్‌, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.