Jun 03,2023 19:21

ఆలూరు ఉప రెవెన్యూ కార్యాలయం

ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయ ఆవరణలో ప్రజలకు, విద్యుత్‌ వినియోగదారులకు మరింత సేవలందించేందుకు జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ వారి ఉప రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించి రెండేళ్లవుతోంది. కార్యాలయం ఏమో ఇక్కడే ఉంది.. అందులో విధులు నిర్వహించే జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌, ఎల్‌డిసి, యుడిసి కంప్యూటర్‌ ఆపరేటర్లు ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎస్‌ఇ ఆలూరు విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకురాగా తక్షణమే వారిని నియమించి ఇక్కడే విధులు నిర్వహించాలని ఆలూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరింగ్‌, అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ను ఆదేశించారు. ఇప్పటివరకు వారి జాడలేదు. కార్యాలయంపై బోర్డునైనా తొలగించాలని, లేదా వినియోగదారులకు సేవలందించేందుకు జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌, ఎల్‌డిసి, యుడిసి ఆపరేటర్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.