నుజ్జునుజ్జయిన కారు
కారును ఢకొీన్న లారీ
నలుగురికి గాయాలు
ప్రజాశక్తి-వరికుంటపాడు:హెచ్ పి గ్యాస్ లోడు లారీ, కారును ఢకొీనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈసంఘటన మండలంలోని కాకొల్లు వారి పల్లి గ్రామ సమీపంలోని 565 జాతీయ రహదారిపై గురువారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం నుంచి గ్యాస్ లోడు లారీ ప్రకాశం జిల్లా కనిగిరి కి వెళ్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా మైలవరం కు చెందిన నలుగురు వ్యక్తులు విజయవాడలో బయలుదేరి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కాకోల్లు వారి పల్లి సమీపంవద్దకు వచ్చే సరికి అదుపుతప్పి లారీ, కారును ఢ కొట్టింది. ఈ సంఘటనలో కారులోని నలుగురు వ్యక్తుల్లో కార్ డ్రైవర్ సుఫాల్ కుడి వైపు కాలు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఖాజా పోలీసుల అదుపులో ఉన్నాడు. వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్‌ఐ విజరు శ్రీనివాస్ తెలిపారు.










