ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక బీచ్ రోడ్డు మార్టిన్ క్లే రెస్టారెంట్ మలుపు వద్ద శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలు దాటాక అదుపు తప్పి కారు బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కారు డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి ఎస్‌ఐ భరత్‌కుమార్‌రాజు కథనం ప్రకారం... మధురవాడ నుంచి అతి వేగంగా భీమిలి వైపు వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు వెనుక కూర్చున్న విజయనగరం జిల్లా బొబ్బిలి సోమావారి వీధికి చెందిన గుంటిరెడ్డి ఉదరు కుమార్ (27) తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవ్ చేస్తున్న మధురవాడకు చెందిన కె.యధుభూషణరావు, కారులో ప్రయాణిస్తున్న కె.వెంకటరమణ, కె.శ్రావణ్‌కుమార్, సింహాచలం, శ్రీనివాసనగర్‌కు చెందిన నాగపూరి ఆనంద రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆనందరాజు భీమిలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మిగిలిన ముగ్గురు గీతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనందరాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ భరత్‌కుమార్‌రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










