కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించకండి
ప్రజాశక్తి-డోన్
శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో తమ పిల్లల్ని చేర్పించి చంపుకోకండని అని ఎస్‌ఎఫ్‌ఐ డోన్ మండల కార్యదర్శి తెలుగు విజరు కుమార్, అధ్యక్షులు అశోక్, కోశాధికారి ఇఫ్ఫనాలు పేర్కొన్నారు. శనివారం స్థానిక డోన్ పట్టణంలోని పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్న గర్ల్స్ హైస్కూల్ దగ్గర కార్పొరేట్ విద్యాసంస్థల్లో మీ పిల్లలను చేర్పించకండని అని కరపత్రాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు ముగిశాయని ఇక ఇంటర్మీడియట్‌లో ఏ కళాశాలలో చేరాలని ఆలోచిస్తుంటారని, కార్పొరేట్ కాలేజీలో ఏ అద్భుతాలు లేవు అని అన్నారు. టీవీలు, పత్రికల్లో ప్రచారాలు తప్ప ఏమి లేదన్నారు. ఆలోచించి నిజాలు ఏంటో తెలుసుకొని కళాశాల్లో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ సభ్యులు శ్రీనివాస్, లవ కుమార్,శివ,వేణుమాధవ్,సునీల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.










