ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టాలని , చైతన్యనారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు అరికట్టాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద శనివారం సాయంత్రం నిరసన కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు, పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు గనిరాాజు, పిడిఎస్‌యూ నగర అధ్యక్షులు ఐ.రాజేష్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘ నేతలు పాల్గొన్నారు.










