Aug 27,2023 21:26

కార్పొరేట్‌ తరహా వైద్యసేవలకు

 కడపప్రతినిధి : జిల్లాలోని కమ్యూనిటీ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యసేవలు అందిస్తాం. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం రీస్ట్రక్షరింగ్‌ పాలసీ ద్వారా కార్డియా లజీ మొదలుకుని గైనకాలజీ వరకు స్పెషలిస్టు వైద్యులు, స్టాఫ్‌నర్స్‌ల నియామకాలను చేసింది. ఎంఆర్‌ఐ, సిటి, టిఫా స్కాన్‌, ఆల్ట్రాసౌండ్‌ సహా అత్యాధునిక లూనార్‌ ఆపరేషన్‌ థియేటర్ల సదుపాయాలను అందు బాటులోకి తెచ్చింది. వీటి సహాయంతో గైనిక్‌, యండి, సర్జరీ, పీడియాట్రిక్‌, కార్డి యాలజీ, హౌస్‌సర్జన్‌ తదితర నిష్టాతులైన వైద్యులతో సేవలను మెరు గుపరచనున్నాం. దీనికితోడు ప్రతినెలా గర్భిణుల చెకప్‌ నిమిత్తం తల్లీబిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ సహాయంతో ఉచిత ప్రయాణ సేవలను అందుబాటులోకి తెచ్చా మని పేర్కొంటున్న సందర్భంగా డిసిహెచ్‌ఎస్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ హిమ దేవితో ప్రజాశక్తి ముఖాముఖి...
జిల్లాలోని సిహెచ్‌సి ఆస్పత్రులు ఎన్ని?
ఉమ్మడి జిల్లా పరిధిలో 10 సిహెచ్‌సి ఆస్పత్రులున్నాయి. వీటి తోపాటు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి, పులివెందుల ఏరియా ఆస్పత్రి ఉన్నా యి. ఇందులో సుమారు 24 రకాల వైద్యసేవలు అందుబాటులో ఉంచడ మైంది.
వైద్యుల కొరతపై మాట్లాడండి?
రాష్ట్రప్రభుత్వం రీస్రక్షరింగ్‌ పాలసీ ద్వారా సాధారణ వైద్యులు దగ్గర నుంచి స్పెషలిస్టు వైద్యులను పెద్దఎత్తున రిక్రూ ట్‌మెంట్‌ చేసింది. ఇందులో భాగంగా 120 మంది వైద్యులు, 40 మంది స్టాఫ్‌నర్స్‌లు అద నంగా రావడమైంది. ఫలితంగా జిల్లా లోని ప్రతి సిహెచ్‌సిల్లో సాధారణ వైద్యుల దగ్గర నుంచి కళ్లు, ఎముకలు, కీళ్లు, చెవి, గుండె, గైనిక్‌, ఆన స్థీషియా సంబంధిత వైద్యనిపుణులతోపాటు స్టాఫ్‌నర్స్‌ పోస్టుల వరకు కొరత లేకుండా పోయింది.
ఓపి సేవల వివరాలు తెలపండి?
జిల్లాలోని 10 సిహెచ్‌సి ఆస్పత్రుల్లో నెల వారీగా 1,45,500 మంది ఔట్‌పేషెంట్లకు వైద్యసేవలు అందు తున్నాయి. ఏప్రిల్‌ నుంచి 85 శాతం నుంచి 92 శాతానికి ఓపి సేవల్లో పెరుగుదల కనిపిస్తోంది. వీటి తోపాటు సుమారు 24 రకాల ల్యాబ్‌, ఎక్స్‌రే తదితర సేవలు అందుబా టులో ఉంచడమైంది.
ఐపి సేవల గురించి చెప్పండిి?
డిసిహెచ్‌ఎస్‌ పరిధిలో ప్రతినెలా 13.200 మంది ఇన్‌పేషెంట్‌ రోగులు ఉన్నారు. గతంలో 83 శాతం నుంచి 123 శాతానికి ఆపరేషన్స్‌ పెరగడం గమనార్హం. ఇందులో ఆపరేషన్స్‌, ఎఫిఎస్‌ డెలివరీస్‌, లాబ్‌టెస్ట్‌ ల సంఖ్య అమాంతంగా పెరిగింది.
అత్యాధునిక వైద్యసేవలను వివరించండి?
హైరిస్క్‌ గర్భిణులు, అనీమియా రోగులకు సెకెండరీ హెల్త్‌కేర్‌ హాస్పిటల్స్‌లో ఆదునిక వైద్య సేవలు అందుబాటులోకి తేవడమైంది. అనీ మియా రోగులకు ఐరన్‌, సుక్రోస్‌ ఇంజెక్షన్స్‌, బ్లడ్‌ట్రాన్స్‌ఫర్మేషన్‌ సదుపా యాలు ఉన్నాయి. సిజేరియన్‌ ఆపరేషన్స్‌, డెలి వరీస్‌ నిర్వహణకు అవసర మైన అత్యా ధునిక పరికరాలు, లూనార్‌ ఆపరేషన్‌ థియేటర్‌ వంటి అత్యా దునిక సదు పాయాలు ఉన్నాయి. వీటిసహాయంతో కార్పొరేట్‌ తరహా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాం.
గర్భిణులకు గల సదుపాయాలు ఏమిటి?
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ప్రతినెలా గర్భిణులు హెల్త్‌ చెకప్‌నకు ఉచిత ప్రయాణ సేవలను అందు బాటులోకి తేవడమైంది. డెలివరీస్‌తో పాటు డేకేర్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి ఉంచడ మైంది. గర్భస్థ శిశు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి టిఫా స్కాన్‌ నిర్వహణకు ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగిన ప్రయివేటు స్కానింగ్‌ సెంటర్‌లో ఉచిత సేవలు పొందేందుకు చర్యలు తీసుకోవడమైంది.
టెలీ మెడిసిన్‌ సేవలు గురించి తెలపండి?
ప్రొద్దుటూరు సిహెచ్‌సి పరిధిలో టెలిమెడిసిన్‌ సేవలు అంది స్తున్నాం. ఇందులో గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్‌, విభాగాల్లో టెలిమెడిసిన్‌ సదుపాయాలు ఉన్నాయి. ర్రోజూ 500 నుంచి 700 మందికి టెలీసేవలను అందిస్తున్నాం.
డయాలసిస్‌ కేంద్రాల గురించి చెప్పండి?
జిల్లాలో ప్రొద్దుటూరు, పులివెందుల సిహెచ్‌సిల్లో డయాలసిస్‌ కేం ద్రాలు ఉన్నాయి. తాజాగా బద్వేల్‌ సిహెచ్‌సిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పా టుకు ప్రతిపాదనలు పంపించాం.
ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉన్నాయి?
జిల్లాలోని అన్ని సిహెచ్‌సిల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపిన 3,255 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ సేవలు అందించడం జరుగుతోంది.డిసిహెచ్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ హిమపద్మజ వెల్లడి