Mar 03,2023 01:13
సైకిళ్లను పంపిణీ చేస్తున్న ఎంపీ వెంకటరమణారావు

ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్రకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గురువారం రేపల్లె రూరల్‌ మండలం పేటేరు గ్రామం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 6 7 తరగతి విద్యార్థినులకు సైకిల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి నాడు నేడు నిధుల ద్వారా కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన ఘనత ఒక జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధితో సర్కార్‌ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరుగుతోందని అన్నారు. లక్షల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వరంగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు రావు నెహ్రూ లక్ష్మి, ప్రభాకర్‌రావు సర్పంచ్‌ కనపర్తి వసుమతి పేటేరు వైసీపీ ఇన్‌ఛార్జి కనపర్తి రవికిరణ్‌, గ్రామ ఉపసర్పంచ్‌ జి శివపార్వతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి కృష్ణమోహన్‌, వైసీపీ నాయకులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.