ప్రజాశక్తి-చీరాల: కార్పొరేట్ మతోన్మాద నిరంకుశ కోరల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని విముక్తి చేయడానికి, సకల ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. గురువారం భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా పేరాలలోని సిఐటియు కార్యాలయంలో చీరాల ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్ చిన్న వయసులోనే ప్రాణాలర్పించాడని అన్నారు. సహచరులు రాజుగుర్, సుఖదేవ్‌లు కూడా భగత్‌సింగ్‌తో పాటు ఉరి తీయబడారు. భగత్ సింగ్ స్ఫూర్తితో నేడు దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులపై ప్రజలంతా కలిసి పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ మతోన్మాద, కార్మిక, ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై ప్రజలంతా పోరాడాలని అన్నారు. ముందుగా కార్పొరేట్ మతోన్మాద నిరంకుశ కోరల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని విముక్తి చేయడానికి, సకల ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలు నిర్వహించటం ద్వారా మరో నూతన సమాజ నిర్మాణానికై పని చేస్తామని, కార్మికవర్గ నాయకత్వంలో సమసమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యకర్తలు టి సుభాషిణి, ఎన్ లక్ష్మి, వి కోటేశ్వరమ్మ, పి రేఖా ఎలిజబెత్, వి భారతి, ఎమ్ పార్వతి, కె సాయినాగలక్ష్మి, సాయి లక్ష్మీ, పావని, బి సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ 92వ వర్థంతిని పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, పట్టణ నాయకులు కె ఆశీర్వాదం, భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేట్ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఆనతరం సీపీఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్, మాట్లాడుతూ ప్రజసంఘాల నాయకులు కార్పొరేట్ మతోన్మాద నిరంకుశ కోరల్లో నలిగిపోతున్న భారతదేశాన్ని విముక్తి చేయడానికి, సకల ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలు నిర్వహించటం ద్వారా మరో నూతన సమాజ నిర్మాణానికై కదిలి పని చేస్తామని, కార్మికవర్గ నాయకత్వంలో సమసమాజ నిర్మాణానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. దేశం కోసం, ప్రజల కోసం సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల కోసం కృషి చేస్తామని హామీ ఇస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ భగత్‌సింగ్ దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చిన్న వయసులోనే ప్రాణాలర్పించాడని అన్నారు. సహచరులు రాజుగుర్, సుఖదేవ్‌లను కూడా భగత్‌సింగ్‌తో పాటు ఉరి తీశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కె ఆశీర్వాదం, కెవి లక్ష్మణరావు, ఎం సూర్య ప్రకాష్, డి శ్రీనివాసరావు, జి దానియేలు, నవీన్, యూ రామకృష్ణ, అగస్టీన్ తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల: దేశం కోసం పిన్నవయసులో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ఉరికొయ్యలకెక్కిన మహాయోధుడు భగత్‌సింగ్ త్యాగం నిరుపమానమైందని వెలుగు ఏపీఎం డి సురేష్ అన్నారు. గురువారం భగత్‌సింగ్ 93వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో విద్యా వనరుల కేంద్రం వద్ద భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భగత్‌సింగ్ ఆశయాల కోసం పాటుపడడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. భగత్‌సింగ్ 92వ వర్థంతి సందర్భంగా గురువారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పీసీ సాయిబాబు, న్యాయవాదులు జమృద్ బాషా, తమలపాకుల భాస్కరరావు, కొర్నేయలు, నాగేశ్వరరావు, సురేష్, లక్ష్మి పాల్గొన్నారు.










