Apr 14,2023 01:13
విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేస్తున్న ప్రిన్సిపల్‌ రవి కుమార్‌

ప్రజాశక్తి-చీరాల: కార్పొరేట్‌ రంగం విస్తరణతో అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే వాటిని దక్కించుకోవడానికి కావలసిన నైపుణ్యాలు లేకపోవడం వలన అనేకమంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారని చీరాల ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి రవికుమార్‌ పేర్కొన్నారు. సిఎస్‌ఇ, ఇసి సీనియర్‌ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం గురువారం చీరాల ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ కళాశాలనే ఒక ప్రయోగశాలగా మార్చుకుని తమ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో బహుమతులు సాధించిన విద్యార్థులకు, మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు, పతకాలు, అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడిలు డాక్టర్‌ సౌజన్య, డాక్టర్‌ బషీరా, డాక్టర్‌ శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, సూర్యనారాయణ, ప్లేస్‌ మేట్‌ ఆఫీసర్‌ బాజీ, విద్యార్థులు సహాయ ఆచార్యులు పాల్గొన్నారు.