Jul 03,2023 21:15

కలెక్టర్‌ గిరీషకు వినతిపత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ

 రాయచోటి టౌన్‌ : జిల్లాలో జిఒనెంబర్‌ 1, 42 అమలు చేయించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని, ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి అన్నారు. సోమవారం స్పందనలో కలెక్టర్‌ పి.ఎస్‌.గిరీష్‌కు వినతి పత్రం సమ ర్పించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియ జేస్తున్న ప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో ప్రయివేట్‌ స్కూల్‌ బస్సుల్లో అధికంగా విద్యార్థులను ఎక్కిస్తున్నారని స్థానికంగా ఉన్న ఆర్‌టిఒకు సమాచారం ఇచ్చిన ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. రాజంపేట, రైల్వేకోడూరు పీలేరు, మదనపల్లె, రాయచోటి ప్రాంతాలలో పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు పేరుతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపా యలు అక్రమంగా వసూలు చేస్తున్నారని, విద్యార్థి సంఘాలుగా అనేక పిర్యా దులు చేసినా ఎలాంటి విచారణ చర్యలు చేపట్టలేదు అన్నారు. కొన్ని పాఠశా లలో ఎటువంటి అనుమతులు లేకుండా హాస్టల్లో కూడా చేరవేస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న అనేక హాస్టల్‌లో జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయా ల్సింది పోయి, కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థలకు అండగా ఉండడం విద్యా శాఖ దారుణం అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ప్రభు త్వం టెండర్‌ ద్వారా ఒక్కో విద్యార్థికి కేవలం రూ.2,400 ఖర్చు చేస్తుందని, అదే కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాల వారు ఇచ్చే 7,8 పుస్తకాలకే రూ.6,000 నుండి రూ.10 వేలు తీసుకుం టున్నారు. వారి ఆదాయం మొత్తంలో సగభాగం పుస్తకాల్లోనే సంపాదిస్తు న్నారని వాపోయారు. ఆర్‌జెడి వెంకటకష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా డిఇఒ పురుషోత్తం, డిప్యూటీ డిఇఒ కష్ణప్ప, వరలక్ష్మి, కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలలకు అనుమతులు రెన్యువల్‌ విషయంలో మామూళ్లు తీసుకొని ఇస్తున్నారనే ఆరోపణలున్నాయని పేర్కొ న్నారు. ఇప్పటికైనా స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణం కార్యదర్శి నరేష్‌, భాను, భానుప్రకాష్‌ పాల్గొన్నారు.