Sep 14,2023 00:16

ప్రజాశక్తి -కారంచేడు
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బుధవారం మౌనదీక్ష చేశారు. మాజీ ఎఎంసి  చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి మాట్లాడుతూ వైసిపి కక్ష సాధింపు ధోరణితో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిందని అన్నారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు కంభంపాటి నరేంద్ర, పాతురి అదిలక్ష్మి, షేక్ కాలేషావలి, నగినేని వెంకటేష్, యార్లగడ్డ సురేష్, కొల్లా భాస్కర్, విలేకర్ శ్రీను, పైడి మనోహర్, వెంకట్రావు పాల్గొన్నారు.