Sep 28,2023 23:02

ప్రజాశక్తి - కారంచేడు 
మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్నాంజనేయ ఆటో వర్కర్స్ యూనియన్ నూతనంగా ఏర్పాటు చేశారు. యూనియన్ జనరల్ బాడీ సమావేశం కాల్వ సెంటర్లో యూనియన్ అధ్యక్షులు ఆవులమంద వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. యూనియన్ బోర్డును సిఐటియు నాయకులు భయ్యా శంకర్ ఆవిష్కరించారు. సభలో యుటిఎఫ్ నాయకులు పావులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామని అన్నారు. బాధ్యతలు గుర్తించి అందరికీ అనుకూలంగా వ్యవహరించాలని యూనియన్ బలపరుచుకోవాలని అన్నారు. ఆటో డ్రైవర్ల అందరూ లైసెన్సులు యూనిఫారం కలిగి ఉండాలని సూచించారు. ప్రయాణికులతో మంచిగా ఉండాలని అన్నారు. హక్కులు సాధించాలని చెప్పారు. సంఘ గౌరవ అధ్యక్షులు పి కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నుండి అన్ని రాయితీలు రాబట్టుకోవడానికి యూనియన్ అవసరమని అన్నారు. డ్రైవర్ మిత్ర ఆటో డ్రైవర్ల అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఆటో డ్రైవర్లపై వేస్తున్న వివిధ రకాల పన్నులు తగ్గించాలని కోరారు. అందరినీ కలుపుకొని ఐక్యంగా యూనియన్ నడుపుకోవాలని చెప్పారు.  కార్యక్రమంలో కార్యదర్శి బి గోపి, ఉపాధ్యక్షులు ఓ శంకరు, డి అంకయ్య, ఉపాధ్యక్షులు డి రాంబాబు, ఎస్ కరుణాకర్, కోశాధికారి ఎస్‌కె బాజీ, ఆటో కార్మికులు పాల్గొన్నారు.