కరపత్రాలను పంచుతున్న నాయకులు
ప్రజాశక్తి - ఆదోని
మున్సిపల్ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న, నాయకులు తిప్పన్న డిమాండ్ చేశారు. శుక్రవారం దశలవారీగా చేపట్టే ఆందోళనను జయప్రదం చేయాలని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ.27 వేలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.










