Jul 04,2023 23:48

ధర్నా చేస్తున్న జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులు

ప్రజాశక్తి - ఏలేశ్వరం
కార్మికులను కొనసాగించాలంటూ చిన్నంపేట శివారు జీడిపప్పు ఫ్యాక్టరీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యులు రొంగుల ఈశ్వరరావు మాట్లాడారు. జీడిపిక్కల ఫ్యాక్టరీలో 1,200 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. యాజమాన్యం జీడిపిక్కలు దొరకడం లేదని, ఇతర కారణాలు చెబుతూ కార్మికులను తొలగించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. లే ఆఫ్‌ ప్రకటించి అనంతరం యంత్రాలతో ఫ్యాక్టరీని కొనసాగించేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందన్నారు. కార్మికులను యథావిధఙగా కొనసాగించాలన్నారు. కనీస వేతనం, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, బోనస్‌ వంటి సౌకర్యాలకు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.వీరబాబు, పి.కనకదుర్గారావు, కె.చక్రధర్‌, ఎన్‌.వీరబాబు, పి.వరలక్ష్మి, జి.లక్ష్మి, కె.అపర్ణ, ఎం.జయలక్ష్మి, కె.అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు.
దిగొచ్చిన యాజమాన్యం
సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేసిన ఆందోళనకు చిన్నింపేటలోని జీడిపిక్కల ఫ్యాక్టరీ యాజమాన్యం దిగొచ్చింది. చెన్నరు నుంచి ఫ్యాక్టరీ బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ యూనియన్‌ నాయకులతో చర్చలకు వచ్చారు. ఫ్యాక్టరీ లే ఆఫ్‌ ప్రకటించేది లేదని వారు రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వేతన పెంపు వర్తించేలా, నెలకు నాలుగు రోజులపాటు వేతనాలతో కూడిన సెలవులు కూడా ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ చర్చల్లో సిఐటియు తుని కార్యదర్శి నెక్కల్ల శ్రీను, సిపిఎం మండల కార్యదర్శి ఆకలపాటి సోమరాజు, జనసేన జిల్లా కార్యదర్శి ఎన్‌.రామకృష్ణ పాల్గొన్నారు.