మదనపల్లె అర్బన్ : గ్రామ పంచాయతీ కార్మికులకు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నాయ కులు తెలిపారు. స్థానిక సిటిఎం రోడ్డులోని డిఎల్‌పిఒ కార్యాలయం ఎదుట ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు చేపట్టిన నిరసనకు రవాణా ట్రాన్స్ ఫోర్ట్ జిల్లా నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు సంఘభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 2012 నుంచి ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని ఆదేశాలు ఉన్న ఎక్కడ అమలు చేయలేదన్నారు. 2019లో జిఒ నెంబర్ 57, 132లలో ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని, బ్యాంక్ ద్వారా తీరాలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్న ఇప్పటివరకు మండనపల్లె రూరల్ గ్రామ పంచాయతీలలో కార్మి కులకు ఎవరికి అమలు చేయలేదన్నారు. గతంలో డిఎల్‌పిఒకు చాలా పర్యాయాలు నోటీసు ఇచ్చామని, అయినా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 2015లో గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పక్కన పెట్టి కార్మికుల దగ్గర శ్రమ దోపిడీ చేయించుకుంటూ, కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా చాలా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మదనపల్లె డివిజన్ పంచాయతీ అధికారి వారు స్పందించి మదనపల్లి రూరల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలోని కార్మికులకు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకట్రామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సురేంద్ర బాబు, జిల్లా నాయకులు ఎం.నాగరాజు, ప్రమీలమ్మ, శ్యామలమ్మ, మండల నాయకులు రవి, గోపాలు, మదనపల్లి రూరల్ మండలం అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు. డిఎల్‌పిఒ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులు










