Oct 09,2023 00:09

ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పిడుగురాళ్ళ: ప్రతి పేదవాడి కల సొంత ఇల్లు అని వారి కల సాకారం దిశగా ఇళ్ళ పట్టాలు చేస్తున్నామని గురజాల శాసన సభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలోని 33వ వార్డులోని ఆదర్శ కాలనీఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కాసు మాట్లడుతూ ఎనోన ఏశల్లుగా ఈ ప్రాంతంలోని సున్నపు బట్టీలలో,క్వారీలలో పనిచేస్తూ, పరిశ్రమల పక్కనే ఉన్న ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ నివాసాలకు సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న ఆదర్శకాలనీ వాసులకు తమ ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తోందని అన్నారు. ఎంతో మంది కార్మికులు కష్టపడి ఈ కాలనీని ఏర్పాటు చేసుకున్నారని, కూలి పనులు చేసుకుంటూ వచ్చిన కూలీ డబ్బులుతో జీవన సాగించే కార్మికులు సొంత స్ధలం కోనుగోలు చేసుకోలేరని ,వారికి వచ్చే ఆదాయం కుటంబ అవసరాలకు సరిపోతుందని, అలాంటి వారికి జగన్‌ ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. కార్మికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రాంతం క్వారీ పరిధిలో ఉండటంతో గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించి క్వారీయింగ్‌ చేసుందుకు సన్నద్దమైందని, ప్రభుత్వం మారడంతో ఈ కాలనీ నిలబడిందని లేకుంటే ఈ సమయానికి ఇక్కడ క్వారీ పనులు జరుగుతుండేవని అన్నారు. ఈ కాలనీలో 800 ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తు న్నట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలు ఉంటే ఇంకా ఎవరూ ఖాళీ చేయించలేరనే భరోసా వారికి ఇచ్చారు. పట్టా ఉంటే ఇంటి నిర్మాణానికి లోన్‌లు ఇప్పిస్తామని వారికి చెప్పారు. కాలనీలో ఇప్పటికే డ్రైనేజి నిర్మాణం చేపట్టామని, త్వరలోనే పిడుగురాళ్లలో ఏర్పాటు చేసినట్లు ప్రతి ఇంటికి కృష్ణనీరు అందిస్తామని, రోడ్లు నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న బైపాస్‌ నిర్మాణం పూర్తి అవుతుందని, ఈ ప్రాం తానికి మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. మెడికల్‌ కళాశాల కూడ వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. కాలనీలో ప్రధానంగా వాలంటీర్‌ వ్యవస్ధ ,సచివాలయ సేవలు అందుబాటులో ఉండటం లేదని పలువురు తమ దృష్టికి తీసుకువచ్చారని, నెల రోజుల వ్యవధిలో అధికారులతో చర్చించి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీ వాసులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహాశీల్ధార్‌ చక్రవర్తి పాల్గొన్నారు,