కార్మికులకు చెత్తబుట్టలు అందజేత
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో చెత్తను సేకరించే పారిశుధ్య కార్మికులకు సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్థార్, జెసిఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, పట్టణ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ చైర్మన్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి, నాయకులు నోటి వినరుకుమార్ రెడ్డి చెత్తబుట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో అన్ని వార్డులను శుభ్రంగా ఉంచేందుకు చెత్త సేకరించి కార్మికులకు వారి పనికి అనువుగా ఉండేలా ఈ చెత్తబుట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బల్లి నాగేశ్వరరావు, ఎఇ ప్రసాద్, ఆర్‌ఐ ఖాసీం, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.










