Nov 21,2023 21:15

ప్రచారం చేస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - వంగర : కార్మికులకు ఎల్లప్పుడూ సిఐటియు అండగా ఉంటుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు, ఉపాధ్యక్షులు టి. సూర్యనారయణ అన్నారు. ఈ నెల 25న వంగర మండల కేంద్రంలో జరుగు భవన నిర్మాణ కార్మిక సంఘం మండల 2వ మహాసభ లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని మంగళవారం ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మహాసభలో రాష్ట్ర ప్రభుత్వం భవనిర్మాణ కార్మికులకు చేసిన అన్యాయంపైనా, భవిష్యత్తు పోరాటా లను చర్చిస్తామని అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న భవనిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేయడం దుర్మార్గమని చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 40 లక్షల భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు సంక్షేమ బోర్డు ద్వారా ఉన్న సంక్షేమాన్ని అనుభవించే పరిస్థితి లేదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా భవననిర్మాణ కార్మికులకు ఈ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనం గాని అదనంగా సంక్షేమ పథకాన్ని గాని అమలు చేసిన పరిస్థితి లేదన్నారు. తక్షణమే భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పటిష్టంగా అమలు చేయాలని పెండింగ్‌ క్లయిమ్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమ ంలో ఆదినారాయణ, ఆదినాయుడు, రమణ, అప్పల నాయుడు, రామినాయుడు, రమణ, లక్ష్మణ, త్రినాధ, విశ్వనాథ రామ్మూర్తి నాయుడు పాల్గొన్నారు.