Aug 25,2023 22:14

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

కార్మికుల వేతనాలు చెల్లించాలి : సిఐటియు
ప్రజాశక్తి-ఉదయగిరి : స్వచ్ఛ భారత్‌ పంచాయతీ కార్మికుల వేతనాలు పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు గడ్డం నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మండల అభివద్ధి కార్యాలయంలో ఎంపిడిఒ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కార్మికులకు 9 నెలలు పంచాయతీ కార్మికులకు 7 నెలలు పర్మినెంట్‌ ఉద్యోగులకు 11 నెలల వేతనాలను ఇంతవరకు రాని మొండి బకాయిలను చెల్లించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
ఉదయం లేవగానే నిత్యం పంచాయతీ పారిశుధ్యంలో ఉండే కార్మికులు వారి కుటుంబ దుర్భర స్థితిలో గడుపుతున్నారని ఎన్ని నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్య లేకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత నిత్యావసరాలు కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు పెండింగ్లో ఉన్న బకాయిలను వేతనాలు చెల్లించి, ప్రభుత్వం నుండి కార్మికులకు రావాల్సిన నూనె సబ్బులు యూనిఫారంలో అందించి, డిపిఒ ఆదేశాల మేరకు 2022-2023 ఉత్తర్వులను మంజూరు చేయాలన్నారు. ప్రతినెలా వేతనాలు అందేలా వారాంతర సెలవులు ప్రకటించాలన్నారు. విధులు నుండి తొలగించిన ఇద్దరు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో విద్యులను బహిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు రమణయ్య చిన్నమ్మి, బాబు, శేఖర్‌, లాజర్‌, తదితరులు పాల్గొన్నారు.