ప్రజాశక్తి-ఉక్కునగరం :విశాఖ ఉక్కు కర్మాగారంలోని రోల్ అండ్ రిపేర్ షాప్ విభాగంలో కార్మికుల సంఖ్య పెంచాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాస్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉక్కునగరంలోని స్టీల్ సిఐటియు కార్యాలయంలో విభాగపు 14వ సిఐటియు మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా వైటి దాస్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలంటే కొత్త కార్మికులకు నైపుణ్యతను ప్రస్తుతమున్న కార్మికులు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విభాగం పట్ల యాజమాన్యం వైఖరిని తక్షణం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు ఉపాధ్యక్షులు యు.రామస్వామి మాట్లాడుతూ కార్మికుల మనోభావాలను గుర్తించకుండా, స్టీల్ ఉత్పత్తిని యాజమాన్యం గణనీయంగా తగ్గించడం దారుణమన్నారు. విభాగం కార్యదర్శి కె బాలశౌరి మాట్లాడుతూ సిఐటియు ఇస్తున్న పిలుపులో భాగస్వామ్యం అవుతున్న విభాగం కార్యకర్తలను అభినందించారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలని అభ్యర్థించారు.
నూతన కార్యవర్గం
విభాగం నూతన అధ్యక్షులుగా యు శ్రీనివాస్, నూతన కార్యదర్శిగా కె బాలశౌరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వివిజిఎస్ డి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా యు వెంకటేశ్వర్లు, బిఎన్ మధుసూదన్, ఎం.ప్రసాద్, అడిషనల్ సెక్రటరీగా కెవి సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కెపి సుబ్రమణ్యం, జాయింట్ సెక్రెటరీగా కెవి ప్రసాద్, అసిస్టెంట్ సెక్రటరీగా కెవిఆర్ మూర్తి, ఎస్‌వి.శర్మ, మరొక 13 మందితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.










