ప్రజాశక్తి చిలమత్తూరు : పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామనిపంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్ హెచ్చరించారు. గత 20 సంవత్సరాలుగా పారిశుధ్య పనులు చేస్తూ ప్రజా సేవకే అంకితం అయిన కార్మికులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని అన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన 3 రోజుల సమ్మెలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించి సమ్మెను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు మండల కార్యదర్శి వెంకటేష్, రామచంద్ర, లక్ష్మి నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్మికులు గౌస్ లాజం, రామాంజినేయులు, చలపతి, రఫీక్ ఆదినారాయణప్ప, నాగప్ప, యామరెడ్డి, ఆదినారాయణ, నరసింహప్ప ఆదిలక్ష్మమ్మ, తిమ్మక్క తదితరులు పాల్గొన్నారు. ముదిగుబ్బ : పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న , సిఐటియు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. వారి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు తమ సమస్యలపై స్థానిక ఎంపిడిఒ విజయలక్ష్మికి గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గురువారం నుంచి మూడు రోజుల పాటు ఆందోళన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైకోర్టు తీర్పును జిల్లాలో అమలు చేయాలని రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఓబుల దేవర చెరువు : స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సిద్ధమని సిఐటియు నాయకులు రమణ , కుల్లాయప్ప శ్రీరాములు హెచ్చరించారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో వరలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్మికులకు 16 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలన్నారు. కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కార్మికులు రామాంజి, గంగాద్రి, గంగులప్ప, అంజమ్మ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు తనకల్లు : స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఏపీ గ్రామపంచాయతీ ఉద్యోగులు,కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నాను నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి 25వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయాలయం వద్ద ధర్నాకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో పూల నరసింహులుకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఒంటెద్దు వేమన్న, మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి ఎం శివన్న, పంచాయతీ కార్మికులు రమణప్ప, అంజి, శివన్న, శాంతప్ప, శ్రీనివాసులు, గంగులప్ప, తదితరులు పాల్గొన్నారు. పరిగి : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు స్వచ్ఛభారత్ కార్మికులతో కలిసి సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా బీరలింగేశ్వర ఆలయం వద్ద సమావేశం నిర్వహించి కార్మిక సమస్యలపై చర్చించారు. సమ్మెలో భాగంగా విధులను బహిష్కరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్చ భారత్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి ఇఎస్‌ఐ, పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, హిందూపురం రాము, కెవిపిఎస్ రమణ, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










