ప్రొద్దుటూరు : కొంత కాలంగా అపరిషృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘ (సిఐటియు అనుబంధం) గౌరవాద్యక్షులు సత్యనారాయణ అన్నారు. సంఘ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు దీక్ష చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న కొబ్బరినూనె సబ్బులు, యూనిఫాం,చెప్పులు ఇవ్వాలన్నారు.హెల్త్ అలవెన్స్ మంజూరు చేయాలన్నారు. అధికారుల వేధింపులు మానుకోవాలన్నారు. వర్షాలు పడుతున్నందున రెయిన్ కోట్లు ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంటి, సాల్మన్, రాష్ట్ర కమిటీ సభ్యులు విజయకుమార్, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, సాయి, రవికుమార్, రవణమ్మ, ప్రమీలమ్మ, గుర్రమ్మ, రమాదేవి పాల్గొన్నారు.










