Oct 13,2023 01:05

ప్రజాశక్తి - చీరాల
ఏపీ గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు)
మండల 3వ మహాసభ స్థానిక ఎన్జీఒ భవన్‌లో కె వీరాంజనేయులు, ఇండ్ల చెంచయ్య అధ్యక్షతన గురువారం నిర్వహించారు. మహాసభను ఉద్దేశించి యూనియన్‌ జిల్లా కార్యదర్శి కొమ్మినేనిశ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య మాట్లాడారు. గ్రామాన్ని పరిశుభ్ర పరచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికులను ఈ ప్రభుత్వం మనుషులుగా గుర్తించడం లేదని అన్నారు. వారి సమస్యలను పెడచెవిన బెడుతుందన్నారు. పంచాయితీ పారిశుద్య కార్మికులను చిన్న చూపు చూస్తుందని అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను గుర్తించాలని అన్నారు. కనీస వేతనం రు.20వేలు చెల్లించాలని అన్నారు. టెండర్లు రద్దుచేసి పిఎఫ్, ఇఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ మండల అధ్యక్ష, కార్యదర్శులుగా జి సురేష్, ఇండ్ల చెంచయ్యను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కె వీరాంజనేయులు, సహాయ కార్యదర్శిగా కె పోతురాజు, గౌరవ అధ్యక్షులుగా ఎం వసంతరావుతోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షలు ఎన్ బాబురావు, భాగ్యమ్మ, సునీత, కూరపాటి మేరీ, వేశపోగు శ్రీను, పి వాసు పాల్గొన్నారు.