Aug 05,2023 20:48

మాట్లాడుతున్న యూనియన్‌ నాయకులు విజయకుమార్‌

 ప్రొద్దుటూరు : కొంతకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను వెంటనే తీర్చాలని కార్మిక నాయకులు కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) నాయకులు విలేకరుల సమావేశంలో జిల్లా వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ విజయకుమార్‌మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులను పర్మినెంట్‌ చేయాలన్నారు. సమానపనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. ఆప్కాస్‌ రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. కార్మికులందరికీ సొంతింటి కలను నెరవేర్చాలన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు టెక్నికల్‌ వేతనాలు ఇవ్వాలన్నారు. బ్యాబ్‌ డ్రెవర్లకు జిఒ7 ప్రకారం రూ.18,500 ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్లపై ఈనెల 1న చేపట్టిన మున్సిపల్‌ కార్యాలయ ముట్టడి కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈనెల 7న తలపెట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల17న చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు సైతం వెనకాడబోమని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు చంటి, సాల్మన్‌, కోశాదికారి రాఘవేంద్ర పాల్గొన్నారు.