Nov 16,2023 23:21

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
పంచాయతి కార్మీకులు గత 11రోజులుగా చేస్తున్న సమ్మెకు సిపిఎం చీరాల డివిజన్‌ కార్యదర్శి ఎన్‌ బాబూరావు మద్దతు ప్రకటించారు. 11రోజులుగా సమ్మె చేస్తున్నా అధికారులు, నాయకులు పట్టించుకోక పోవటం బాధ్యతా రాహిత్యమని ఆరోపించారు. గత 3నెలలుగా కార్మీకులకు రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 3సంవత్సరాల నుండి బట్టలు, సబ్బులు, అందజేయలేదని అన్నారు. కార్మీకులకు రావాల్సిన న్యాయమైన జీతాలు చెల్లించకుండా కారంచేడు మండలం నుండి కార్మీకులను తీసుకు వచ్చి పనిచేయించాలనే ఆలోచనను మానుకోవాలని హెచ్చరించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. సమ్మె చేస్తున్న వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇలాగే కొనసాగితే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెలో సిఐటియు పర్చూరు డివిజన్‌ కార్యదర్శి జి ప్రతాప్‌కుమార్‌, కార్మీకులు నల్లపు రంగారావు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు పాల్గొన్నారు.

పంచాయితీ కార్మికులు గత 10రోజులుగా సమ్మె చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన పంచాయితీ పాలకవర్గం, అధికారులు పోటీ కార్మికులతో పనులు చేయించే ప్రయత్నం చేస్తూ కార్మికుల సమస్యలను జటిలం చేస్తున్నారు. కార్మికుల సమ్మెతో గ్రామంలో చెత్త, చెదారం ఎక్కడి కక్కడ పేరుకు పోయింది. మురుగు నీరు పారక ప్రధాన కాలువల్లో మురుగు నీరు రోడ్డుపైకి పారుతున్నది. గతంలో కూడా ఇలానే జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. కరోన సమయంలో అమూల్యమైన సేవలందించిన పంచాయతి కార్మీకులకు కనీసం 3 సంవత్సరాల నుండి కార్మికులకు ఇవ్వాల్సిన రక్షణ పరికరాలైన చెప్పులు, బట్టలు, సబ్బులు, నూనెలు ఇవ్వక పోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సాక్షాత్తు కలెక్టర్‌కు చెప్పిన కూడా సమస్య పరిష్కారం కావడం లేదు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామంలో డెంగూ కేసులు ఉన్నాయి. జలుబు, దగ్గులు, సాధారణ జ్వరాలు ఉన్నాయి. ఇంత ప్రాధాన్యత ఉన్న ఇంకొల్లుకు పారిశుద్ధ్యం కొరవడింది. సమ్మెకు మద్దతు ఇచ్చిన సిఐటియు నాయకులు నాగండ్ల వెంకట్రావును బెదిరిస్తున్నారు. గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైనా పంచాయతి కార్మీకులకు జీతాలు చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.