సిఐటియు ఆధ్వర్యాన మెయిన్‌గేటు వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులు
ప్రజాశక్తి -గాజువాక: భెల్ కార్మికుల ప్రయోజనాలకు గండికొడితే ఆందోళన చేస్తామని భెల్ సిఐటియుప్రధాన కార్యదర్శి జిటిపి ప్రకాష్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో జాతీయ కార్మికసంఘాల నేతలతో భెల్ యాజమాన్యం నిర్వహించిన సంయుక్త సమావేశంలో కార్మికుల ప్రతికూల నిర్ణయాలు తీసుకోవడాన్ని నిరసిస్తూ భెెల్ మెయిన్ గేట్ వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. కరోనా పేరుతో మూడేళ్ల బోనస్‌ను యాజమాన్యం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. కార్మికులకు న్యాయం చేయకుంటే అన్ని యూనియన్లను సమీకరించి ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.జగన్నాథరావు, సిహెచ్ నారాయణ, చిన్నబాబు, హెచ్ భోగేష్, ఆర్ జనార్థనరావు, అధిక సంఖ్యలో కార్మికుల పాల్గొన్నారు.










