Jul 10,2023 00:10

కంపెనీ ముందు నిరసన తెలుపుతున్న కార్మికులు

మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల నికో ఆగ్రో ఆయిల్‌ కంపెనీలో కార్మికుల నిరసన ఆదివారం 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండల సిఐటియు నాయ కులు ఎస్‌ఎం బాషా మాట్లాడుతూ కంపెనీలో పనిచేసే కార్మికుల న్యాయ బద్ధమైన కోరికలు యజమాన్యం తీర్చేందుకు ముందుకు రావాలని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇంక్రిమెంట్లు పెంచకుండా యాజమాన్యం తాత్సారం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌.శ్రీకాంత్‌, షేక్‌ మీరా సాహెబ్‌, కె వీర్రాజు, ఈ అబ్దుల్లా, కె.శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్‌ రాంబాబు, ఎస్‌ఎం బాషా తదితరులు పాల్గొన్నారు.