కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సిఐటియు ధ్వజం
పజాశక్తి -పాడేరు : కార్మికుల సంక్షేమం కంటే కార్పొరేట్ కంపెనీల లాభమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమని, కార్మిక వర్గం కోసం కాకుండా వాటి కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు అల్లూరి జిల్లా ప్రధానకార్యదర్శి ఉమామహేశ్వరరావు విమర్శించారు.మంగళవారం చింతపల్లిలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సాగిన చిరంజీవి అధ్యక్షతన నిర్వహించిన మండలంలో వివిధ రంగాల కార్మికుల విస్తృతస్థాయి సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వచ్చేనెల 20, 21తేదీల్లో అల్లూరు జిల్లా మొదటి మహాసభ జరగనుందని, కార్మికులంతా హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు అమలు, ఇతర సమస్యలతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి కదలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, జీకే వీధి మండల నాయకులు గడుతూరి సత్యనారాయణ, వైటిసి యూనియన్ ప్రతినిధి వేములపూడి రామకృష్ణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా కోశాధికారి పాంగి పెంటమ్మ, మధ్యాహ్నం భోజన కార్మికుల జిల్లా అధ్యక్షులు పసుపులేటి లక్ష్మి, పద్మ, పార్వతి, ఆశ యూనియన్ నేత కించే కొండమ్మ, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నేత కేసు బాబు, పంచాయతీ కార్మికుల సంఘం నాయకుడు నూకరాజు పాల్గొన్నారు,










