Aug 04,2023 19:17

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ స్వామి

ప్రజాశక్తి-ఆలూరు
ఎస్‌ఆర్‌కె కన్‌స్ట్రక్షన్‌లో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం కడుపు మాడుస్తోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో కార్మికులతో కలిసి మాట్లాడారు. ఎస్‌ఆర్‌కె కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఆదోని నుంచి చింతకుంట వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులను చేపడుతోందని తెలిపారు. నిర్మాణ పనుల కోసం ఆలూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులతో పనులు చేయించుకొని 7 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. 'అదిగో.. ఇదిగో' అంటూ యాజమాన్యం మోసం చేస్తూ కార్మికులను, వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిందన్నారు. కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఇతర రాష్ట్రాల కార్మికులకు వేతనాలు అందకపోగా ఆలూరు పట్టణంలో డబ్బులు అడుక్కొని వారి రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. ఇక్కడే ఉన్న కార్మికులకు జీతాలు ఇస్తామని ఆశలు చూపి చివరికి చేతులెత్తేశారన్నారు. కంపెనీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.