ప్రజాశక్తి -ములగాడ : పెరుగుతున్న ధరలకనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌చేశారు. డాక్ యార్డు వద్ద ఉన్న ఐపిఎల్ గొడౌన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జనరల్ బాడీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి జగ్గునాయుడు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొటీ పడి ధరలను పెంచుతున్నాయని, కార్మికుల జీతాలు మాత్రం ఆమేరకు పెరగడం లేదన్నారు. కార్మికులకు ఉపాధిలేక సరైన పనులు లేక నానాఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత 44కార్మిక చట్టాలను 4లేబర్ కోడ్స్‌గా మార్పుచేసి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారను. ముఠాకార్మికులందకీ చట్టంచేయాలని సెప్టెంబరు 20న కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే ధర్నాలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎం.జగ్గునాయుడు, అధ్యక్షులుగా పి.పైడిరాజు, ప్రధాన కార్యదర్శిగా అప్పలనాయుడు, సహాయకార్యదర్శిగా టి.బంగారురాజు, కోశాధికారిగా ఎస్.సత్యారావు, సభ్యులుగా సత్యనారాయణ, ముత్యాలప్పడు, జె.మూర్తిలను కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కమిటీకి సిఐటియు మల్కాపురంజోన్ ప్రధానకార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి అభినందనలు తెలిపారు. కార్మికులంతా హక్కుల సాధన కోసం ఐక్యంగా పొరాడాలని పిలుపునిచ్చారు. గొడౌన్ అధ్యక్షులు పి.పైడిరాజు మాట్లాడుతూ, కార్మికులంతా ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమన్నారు.










