ప్రజాశక్తి కంచరపాలెం: ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఎపి జెఎఎఫ్ ఆధ్వర్యంలో కార్మికులకు హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం కంచరపాలెం హైవేలోని స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల ఇంటక్ వైస్ ప్రెసిడెంట్ మేరపురెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిప్యూటీ డైరెక్టర్ (కొరియా) సతోషి ససాకి మాట్లాడుతూ కార్మికులకు న్యాయబద్ధంగా రావలసిన హక్కులు, పని ప్రదేశంలో సౌకర్యాలు, పనికి తగ్గ వేతనం తదితర విషయాలను వివరించారు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ ఒకే తాటిమీదకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతామన్నారు. అనంతరం ఐఒఎల్ సౌజన్యంతో డబ్ల్యుఐఎస్‌సి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ టెక్నికల్ అడ్వైజర్ సుదిప్త భద్ర, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రామారావు, ఇంటక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుమ్మడి ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు










