Sep 06,2023 18:27

మండల టిడిపి అధ్యక్షులు వేముల పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :కార్మికులు పోరాడి సాధించుకొన్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సిపిఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య, సీఐటీయు మండల కార్యదర్శి మారుబోయిన రాజాలు విమర్శించారు.భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం తోటపల్లిగూ డూరు మండలం మండలం నరుకూరు సెంటర్లోని కామ్రేడ్‌ జక్కా వెంకయ్య స్మారక సిఐటియు కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు మారుబోయిన వెంకట శేషయ్య అన్నం పుట్టయ్యలు అధ్యక్ష తన జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య, రాజాలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులని కాలరాసే విధంగా చట్టాలు రూపొం దిస్తున్నాయని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నిధులు కార్మికులకి వినియోగిం చకుండా సంక్షేమ పథకాల రూపంలో దారి మళ్లించడం అన్యాయమని వెంకయ్య, రాజాలు ధ్వజమెత్తారు. కార్మిక హక్కులను కాపాడుకోనేం దు కోసం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వ ర్యంలో జాతీయ సమావేశాలు నెల్లూరులో ఈ నెల 15 ,16, 17 తేదీలలో నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేది సాయంత్రం 4 గంటలకు విఆర్సి గ్రౌండ్‌ నుండి ముత్తుకూరు గేట్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ చేపడుతున్నట్లు వెంకయ్య, రాజాలు తెలిపారు. అనంతరం ముత్తుకూరు గేట్‌ సెంటర్‌ వద్ద బహిరంగ జరుగు తుందన్నారు. ఈ సభకు అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్య లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు.