Apr 27,2023 23:19

సమావేశంలో మాట్లాడుతున్న దువ్వ శేషబాబ్జి

మేడే విజయవంతం చేయాలని ప్రజా సంఘాల పిలుపు
ప్రజాశక్తి - పిఠాపురం
జన విజ్ఞాన వేదిక, మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే పురస్కరించుకొని మేడే వర్థిల్లాలి కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం నినాదంతో గురువారం సూర్య గ్రంథాలయంలో అవగాహన సదస్సు మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌ సూర్య నారాయణ అధ్యక్షతన జరిగింది. వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రోజువారి కూలి పనులు చేస్తూ తెచ్చుకుంటున్న సగం డబ్బులు మద్యానికే ఖర్చు చేస్తున్నారని అన్నారు, ఇటీవల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు విద్య, వైద్యం ఖర్చులు విప రీతంగా పెరగడంతో కార్మికులు తీవ్ర ఆందోళన గురవుతున్నారన్నారు, మద్యం సేవించడం వలన కార్మికులు అనారోగ్యాలు గురై అతి చిన్న వయసులోనే చనిపోతున్నారని కార్మికులు మద్యం సేవించకుండా కుటుంబమంతా ఆరోగ్యంవంతమైన పౌష్టికాహారం తీసుకో వాలన్నారు, ప్రతి కార్మికుడి కుటుంబం మేడేను పండుగలాగా జరుపుకోవాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు, కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి శేషు బాబ్జి, జెవివి జిల్లా అధ్యక్షులు కెఎంఎంఆర్‌ ప్రసాద్‌, మద్యపానం వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.సత్యనారాయణ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు కె అప్పారావు, ఏలేటి నానిబాబు, కరుణ రాజ్‌, న్యాయవాది కొంగు నూకరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు డేగల సత్తిబాబు, కొయ్యల రమణ, మాల మహా గర్జన రాష్ట్ర అధ్యక్షుడు దానం లాజర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.
సామర్లకోట హమాలిస్‌ యూనియన్‌ అధ్యక్షులు నాళం సత్యనారాయణ మేడేను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం హమాలీ సభ్యులకు నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హమాలీస్‌ గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్‌ మేడే కరపత్రాలను ఆవిష్కరించి మేడే ప్రాధాన్యత గురించి సభ్యులకు వివరించారు. కార్మికులంతా ఐక్యతతో ఈ మేడే స్పూర్తితో మన హక్కులు కాపాడు కోవాలని ప్రతీ కార్మికుడు తన ఇంటిపై కార్మిక జెండా, సిఐటియు జెండా ఎగుర వేయాలని హమాలీ సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు సమావేశంలో హమాలీ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి కొండలరావు, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వి. అప్పలరాజు, కోశాధి కారి బి. ఆదినారాయణ, పి. సత్తిబాబు, వి. గోవిందు, కె. దుర్గాప్రసాద్‌,యు. సతీష్‌,బి. భాస్కర్‌, ఎ.అర్జున్‌, బి. వాసు, హమాలీ సభ్యులు పాల్గొన్నారు.